సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డులు స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీచేసింది. కొత్త రెవెన్యూ చట్టం దిశగా వేగవంతంగా కసరత్తు చేస్తున్న క్రమంలో ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డులు స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీచేసింది. మధ్యాహ్నం 12లోగా వీఆర్వోలు రికార్డులు అప్పగించాలని, ఈ మొత్తం ప్రక్రియ మధ్యాహ్నం 3లోగా పూర్తి కావాలని సూచించింది. సోమవారం సాయంత్రంలోగా కలెక్టర్ల నుంచి సమగ్ర నివేదిక రావాలని కోరిన సీఎస్ సోమేశ్‌కుమార్ కోరారు. అయితే రెవెన్యూశాఖలో సమూల మార్పులపై కొన్నాళ్లుగా పలు సభలు, అసెంబ్లీలో తరచూ మాట్లాడుతున్న సీఎం కేసీఆర్ ‘ల్యాండ్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ యాక్ట్’ను తీసుకురావాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే సంబంధిత బిల్లును ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు.
- September 7, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- CM KCR
- REVENUE RECORDS
- TELANGANA
- TS ASSEMBLY
- VROS
- అసెంబ్లీ
- తెలంగాణ
- రెవెన్యూ యాక్ట్
- వీఆర్వో
- సీఎం కేసీఆర్
- హైదరాబాద్
- Comments Off on వీఆర్వోలకు ‘రెవెన్యూ పవర్’ కట్