సారథిన్యూస్, రంగారెడ్డి: ఓ వివాహిత హత్యకు గురైంది. కాగా ఆమెను చంపింది తొమ్మిదో భర్త కావడం విశేషం. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా పహాడిషరీఫ్ పరిధిలోని శ్రీరామ కాలనీలో చోటుచేసుకున్నది. వరలక్ష్మి (35)ని కొంతకాలం క్రితం శ్రీరామ కాలనీకి చెందిన నాగరాజు (36) వివాహం చేసుకున్నాడు. కాగా వరలక్ష్మి అప్పటికే ఎనిమిది పెళ్లిళ్లు చేసుకొని.. వేర్వేరు కారణాలతో భర్తలకు విడాకులు ఇచ్చింది. నాగరాజు ఆమెకు తొమ్మిదోభర్త. కాగా ఇటీవల భార్య, భర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. మంగళవారం వీరి మధ్య మరోసారి ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయిన నాగరాజు.. తన భార్య వరలక్ష్మిని కత్తితో గొంతుకోసి దారుణంగా హతమార్చాడు. కాగా ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
- July 28, 2020
- Archive
- రంగారెడ్డి
- లోకల్ న్యూస్
- CRIME
- HUSNABAD
- HYDERABAD
- MURDER
- RANGAREDDY
- WIFE
- భార్య
- హత్య
- Comments Off on వివాహిత హత్య.. చంపింది తొమ్మిదో భర్త