సారథి న్యూస్, అనంతపురం: ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయనతో పాటు కుమారుడు జేసీ అస్మిత్‌రెడ్డిని అనంతపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అనంతరం వీరిని హైదరాబాద్ నుంచి అనంతపురానికి తరలించారు. బీఎస్-3 వాహనాలను బీఎస్-4గా రిజిస్ట్రేషన్ చేసి అమ్మకాలు సాగించినట్లు తేలడంతో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై కూపీ లాగగా నకిలీ పత్రాలు సృష్టించి ఇప్పటివరకు 154 వాహనాలు నాగాల్యాండ్‌లో రిజిస్ట్రేషన్ చేయించినట్లు గుర్తించారు. వాటికి సంబంధించిన ఫేక్ ఎన్వోసీ, ఫేక్ ఇన్సూరెన్స్‌ల కేసుల్లో వీరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. నకిలీ రిజిస్ట్రేషన్లకు సంబంధించి జేసీ ట్రావెల్స్‌పై 24 కేసులు నమోదయ్యాయి. కాగా, అనంతపురం, తాడిపత్రి పోలీసు స్టేషన్లలో జేసీ ట్రావెల్స్‌పై ఇప్పటిదాకా 27 కేసులు నమోదయ్యాయి.
- June 13, 2020
- Archive
- Top News
- అనంతపురం
- ఆంధ్రప్రదేశ్
- ANATHAPURAM
- JC PRABHAKAR
- ట్రావెల్స్
- బీఎస్-3 వెహికిల్స్
- హైదరాబాద్
- Comments Off on టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి అరెస్ట్