మునగాల: సూర్యాపేట జిల్లా మునగాలలో గత రెండ్రోజులగా కురుస్తున్న వర్షాలతో రోడ్ల మీద నీళ్లు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని మునగాల ఎస్సై సత్యనారాయణగౌడ్ సూచించారు. రెండురోజులుగా కురుస్తున్న వర్షాలకు మునగాల మండలంలోని తాడువాయి నుంచి తాడువాయి తండా మధ్యలో ఉన్న అలుగు ఉధృతంగా ప్రవహిస్తున్నదన్నారు. ఈ మార్గాల గుండా వెళ్లే ప్రజలు ప్రత్యామ్నాయ దారులు చూసుకోవాలని ఆయన కోరారు. అదే విధంగా మునగాల నుంచి గణపవరం, తిమ్మారెడ్డిగూడెం, కొక్కిరేణి, వెల్దండ, చీదేళ్ల, తంగెళ్ల గూడెం, మల్కాపురం వెళ్లి గ్రామాల ప్రజలు కూడా గణపవరం మునగాల మధ్యలో గల గణపవరం వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నందున అక్కడి ప్రజలు రాకపోకలు కొంతకాలం బంద్ చేయాలని కోరారు.
- September 14, 2020
- Archive
- నల్లగొండ
- లోకల్ న్యూస్
- HYDERABAD
- KCR
- NALGONDA
- POLICE
- SURYAPETA
- TELANGANA
- తెలంగాణ
- పోలీస్
- సీఎం కేసీఆర్
- హైదరాబాద్
- Comments Off on వాన ఎక్కువైంది జర భద్రం