సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరద సహాయక చర్యలపై సోమవారం ఉదయం కలెక్టర్ జి.వీరపాండియన్ జిల్లా అధికారులను అలర్ట్ చేశారు. జిల్లాలో అధికారులు వారు పనిచేసే ప్రదేశాల్లోనే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కర్నూలు, నంద్యాల, ఆదోని డివిజన్లలో ప్రత్యేకంగా నంద్యాల, ఆత్మకూరు, కొత్తపల్లి తదితర ప్రాంతాల్లో ఉప్పొంగుతున్న నదులు, వాగులు, వంకలు, చెరువుల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తాగునీరు, రాకపోకలు, విద్యుత్ కు అంతరాయం లేకుండా, ప్రాణ, పంటనష్టం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఉధృతంగా ప్రవహించే నదులు, వాగులు, వంకలు, చెరువుల వద్దకు వెళ్లకూడదని, ప్రవాహ నీటిలో దిగడం, దాటడం చేయకూడదని, పాడుబావులు, మట్టిగోడల వద్ద ఉండకూడదన్నారు. వరద నీటి ప్రాంతాల ప్రజలు తాగునీటిని కాచి, చల్లార్చిన తర్వాతే తాగాలని కలెక్టర్ వీరపాండియన్ జాగ్రత్తలు సూచించారు.
- September 14, 2020
- Archive
- Top News
- ఆంధ్రప్రదేశ్
- షార్ట్ న్యూస్
- COLLECTOR
- HEAVYRAINS
- Kurnool
- VEERAPANDYAN
- కర్నూలు
- కలెక్టర్
- భారీవర్షాలు
- వీరపాండియన్
- Comments Off on వర్షాల వేళ.. అలర్ట్గా ఉండండి