సారథిన్యూస్, వెల్దుర్తి: పెళ్లయిన రెండోరోజే వరుడిని ఐసోలేషన్‌కు, వధువును క్వారైంటైన్‌కు తరలించిన ఘటన ఏపీలోని కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం మర్రిమానుతండాకు చెందిన యువకుడు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. కాగా అతడికి వెల్దుర్తి మండలం ఎల్ తండాకు చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. యువకుడికి కరోనా లక్షణాలు ఉండటంతో వైద్యులు అతడి నమూనాలు సేకరించారు. అయినప్పటికి యువకుడు ఈ నెల 10న ఎల్ తండాకు వచ్చి అక్కడ యువతిని వివాహం చేసుకున్నాడు. అదే రోజు అతడు అస్వస్థతకు గురయ్యాడు. వైద్యపరీక్షల్లోనూ అతనికి కరోనా పాజిటివ్‌గా తెలిసింది. దీంతో పోలీసులు ఆ గ్రామాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించి.. వివాహానికి హాజరైన 70 కుటుంబాలను క్వారైంటైన్‌కు తరలించి వారి నమూనాలు సేకరించారు.
- June 13, 2020
- Archive
- ఆంధ్రప్రదేశ్
- CARONA
- HYDERABAD
- ISOLATION
- Kurnool
- కరోనా పాజిటివ్
- Comments Off on వరుడు ఐసోలేషన్‌లో..వధువు క్వారంటైన్‌లో!