Breaking News

వరద సాయం కోసం ‘మీసేవ’ వద్దకు వెళ్లొద్దు

వరద సాయం కోసం ‘మీసేవ’ వద్దకు వెళ్లొద్దు

సారథి న్యూస్, హైదరాబాద్: జీహెచ్ఎంసీలో వరద సహాయం కోసం మీ సేవ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి ఇంకా వరద సహాయం అందని వారి వివరాలను సేకరిస్తున్నాయని తెలిపారు. బాధితుల వివరాలు, ఆధార్ నంబర్​ ధ్రువీకరణ జరుగుతుందని, ఆ తర్వాత వారి అకౌంట్ లోనే వరద సహాయం డబ్బులు జమవుతాయని చెప్పారు. ఈనెల 7వ తేదీ నుంచి సాయం అందని వారికి మళ్లీ ప్రారంభిస్తామని తెలిపారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.6.64 లక్షల వరద బాధిత కుటుంబాలకు రూ.664 కోట్లు అందజేసినట్లు ప్రకటించింది. మరో 3.31లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం వరద సాయాన్ని వాయిదా వేసింది.