సారథి న్యూస్, రామాయంపేట: మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని నస్కల్, రాంపూర్, చల్మేడ గ్రామాల్లో శుక్రవారం రామాయంపేట సహకార సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు సెంటర్లను చైర్మన్ బాదె చంద్రం, నిజాంపేట ఎంపీపీ సిద్ధరాములు కలసి ప్రారంభించారు. రైతులు ఈ కొనుగోలు సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ‘ఏ’ గ్రేడ్ వరి ధాన్యానికి రూ.1,888, సాధారణ రకానికి రూ.1,868 కేటాయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఈవో నర్సింలు, సొసైటీ డైరెక్టర్ సుధాకర్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు గౌస్, ఆయా గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు.
- October 30, 2020
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- medak
- NIZAMPET
- RAMAYAMPET
- ధాన్యం కొనుగోళ్లు
- నిజాంపేట
- మెదక్
- రామాయంపేట
- Comments Off on వడ్ల కొనుగోళ్లు షురూ