మిల్కీబ్యూటీ తమన్నా మరోసారి పవన్‌కల్యాణ్‌తో జోడి కట్టనుందని సమాచారం. బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘పింక్’ను తెలుగులో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రంలో ఇప్పటికే పవన్ సరసన అంజలి, నివేదా థామస్ నటిస్తున్నారు. షూటింగ్ కూడా కొంతభాగం పూర్తయింది. మరో హీరోయిన్‌కు కూడా చిత్రంలో అవకాశం ఉండటంతో చిత్ర నిర్మాతలు ఆ పాత్రకు తమన్నాను ఎంపికచేశారట. భారీ రెమ్యునరేషన్ ఇస్తుండటంతో తమన్నా ఈ పాత్రకు ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ సినిమాలో పవన్ న్యాయవాదిగా కనిపించబోతున్నారు. లాయర్ గెటప్‌లో పవన్ కల్యాణ్ కోర్టులో వాదిస్తున్న ఓ స్టిల్ ఇటీవల లీక్ అయింది.
- July 2, 2020
- Archive
- Top News
- సినిమా
- HYDERABAD
- PAWAN KALYAN
- PINK
- TAMMANNA
- VENU SREERAM
- పింక్
- వేణు శ్రీరామ్
- Comments Off on వకీల్‌సాబ్‌లో తమన్నా