- మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్
సారథి న్యూస్, మానవపాడు: మూడు రైతు వ్యతిరేక చట్టాలను పార్లమెంట్లో ఆమోదించి రైతులను రోడ్ల పైకి వచ్చేలా చేసిన బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఏఐసీసీ సెక్రటరీ, మాజీ ఎమ్మెల్యే ఎస్సంపత్కుమార్ అన్నారు. మంగళవారం రైతు సంఘాల పిలుపు మేరకు భారత్ బంద్ కార్యక్రమాన్ని అలంపూర్ నియోజకవర్గంలో చేపట్టారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు రోడ్డుపైనే బైఠాయించి వంటావార్పుతో అక్కడే భోజనాలు చేశారు. ‘మోడీ.. కేడి, బీజేపీ హఠావో.. రైతులను బచావో’ నినదించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఎస్.సంపత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. రైతుల ఉద్యమం యావత్ దేశం మొత్తం కనిపించకుండా మీడియా, పత్రికలను సైతం బీజేపీ ప్రభుత్వం మేనేజ్ చేసి ప్రసారాలను నిలిపివేసిందన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ మొసలికన్నీరు కారుస్తోందన్నారు. రైతులకు వెంటనే రైతుబంధు ఇవ్వాలని, పంటనష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులు పడుతున్న కష్టాల్లో పాలుపంచుకుని పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మానవపాడు ఎంపీపీ అశోక్ రెడ్డి, వైస్ ఎంపీపీ సోమన్నగౌడ్, జగన్ మోహన్ నాయుడు, వేల్పుల రవి, మల్లికార్జున్ రెడ్డి, నేతాజీ, కాంతారెడ్డి, ఆనంద్, శేషి రెడ్డి, దస్తగిరి, ప్రకాశం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ సుజాతమ్మ, ఇటిక్యాల మండలం మధుసూదన్ రెడ్డి, శ్యామ్, ధర్మారం నాయుడు, సుదర్శన్ రెడ్డి, రవిప్రకాష్, అలంపూర్ మండలం అడ్డాకుల రవి, రుక్కు, అయిజ నుంచి షేక్షావలి ఆచారి దేవరాజు, ఉండవెల్లి మండలం నుంచి గజేంద్రరెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, హరి, ఆయా మండలాల రైతులు, కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.