సారథి న్యూస్, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మిషన్ భగీరథ నీటిని మాత్రమే ప్రజలు వినియోగించుకునేలా చైతన్య కార్యక్రమాలు మరిన్ని రూపొందించాలని ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి స్మితా సబర్వాల్ సూచించారు. బుధవారం మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయంలో అన్ని జిల్లాల సీఈలు, ఎస్ఈలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కొత్తగా నిర్మిస్తున్న రైతువేదికలు, వైకుంఠధామాలకు భగీరథ నీటిని అందించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ విద్యాసంస్థలు, ప్రభుత్వ ఆస్పత్రులు, ధార్మిక సంస్థలకు వాటర్ కలెక్షన్లు ఇవ్వాలని ఆదేశించారు. రోజువారీ తాగునీటి సరఫరా తీరును ఈఎన్ సీ కృపాకర్ వివరించారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు శుద్ధిచేసిన పరిమాణం కంటే ఎక్కువగానే నీటి సరఫరా చేస్తామని వివరించారు.
- December 16, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- CM KCR
- RYTHUVEDIKA
- SMITHA SABRWAL
- TELANGANA
- తెలంగాణ
- రైతువేదికలు
- వైకుంఠధామాలు
- సీఎం కేసీఆర్
- స్మితా సబర్వాల్
- Comments Off on రైతువేదికలు, వైకుంఠధామాలకు భగీరథ నీళ్లు