సారథి న్యూస్, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలోని నారాయణపురం, మద్దూరు, కలుగొట్లలో రైతు వేదిక భవనాలను బుధవారం వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే అబ్రహం ప్రారంభించారు. రైతుల అభ్యున్నతి కోసమే రైతు వేదికలను నిర్మిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 60లక్షల రైతు కుటుంబాలకు మేలు జరుగుతుందన్నారు. రైతు వేదికల వద్ద రైతాంగం సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు. అన్నదాతల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ సరిత, కలెక్టర్ శృతిఓజా, సర్పంచ్ లక్ష్మీదేవి, సర్పంచ్ నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.
- November 11, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- ALAMPUR
- GADWALA
- JOGULAMBA
- MANAVAPADU
- MLA ABRAHAM
- RYTHUVEDIKA
- అలంపూర్
- ఎమ్మెల్యే అబ్రహం
- జోగుళాంబ గద్వాల
- మానవపాడు
- రైతువేదిక
- Comments Off on రైతుల అభ్యున్నతి కోసమే రైతువేదికలు