సారథి న్యూస్, అమరావతి : సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ అగ్రిల్యాబ్ లు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా స్థాయిలో 13 అగ్రిల్యాబ్ లు, నియోజకవర్గ స్థాయిలో 147 అగ్రి ల్యాబ్ లు, రాష్ట్ర స్థాయిలో 4 వైఎస్సార్ అగ్రిల్యాబ్స్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖ, గుంటూరు, ఏలూరు, తిరుపతి నగరాల్లో ప్రాంతీయ ల్యాబ్స్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఈ ల్యాబ్స్ వల్ల విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యత పరిశీలించనున్నారు. ప్రతి సంవత్సరం నకిలీ విత్తనాలు, నాసిరకం ఎరువులు, పురుగుల మందుతో రైతాంగం తీవ్ర నష్టపోతుంది. దీంతో రైతులు ఆర్థికంగా నష్టపోయేవారు. ఈ ల్యాబ్స్ వల్ల అన్ని పరిశీలించిన తర్వాతే విత్తనాలు,ఎరువులు,పురుగుమందులు బయటికి పంపుతారు. దీంతో రైతులకు ప్రయోజనం చేకూరనుంది.
- July 25, 2020
- Archive
- ఆంధ్రప్రదేశ్
- ముఖ్యమైన వార్తలు
- AMARAVATHI
- Farmers
- Jagan
- అమరావతి
- జగన్
- రైతులు
- Comments Off on రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త..