సారథిన్యూస్, రామడుగు: సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబీమా పథకం అన్నదాతల పాలిట గొప్పవరమని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇటువంటి పథకం లేదని చెప్పారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండి గ్రామానికి చెందిన దుర్గం రములు అనే రైతు ఇటీవలే చనిపోగా అతడి కుటుంబానికి బుధవారం ఎమ్మెల్యే రైతు బీమా ప్రొసీడింగ్స్ అందజేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, ఎంపీపీ కల్గెటి కవిత, జెడ్పీటీసీ మారుకొండ లక్ష్మీ, సర్పంచ్ గుండి మానస, మార్కెట్ కమిటీ చైర్మన్ గంట్లా వెంకట్ రెడ్డి, టీఆర్ఎస్ నేతలు గంట్లా జితేందర్ రెడ్డి, జూపాక కర్ణాకర్, ఎంపీటీసీ శ్యాం, ఏడీ రామారావు, ఏవో యాస్మిన్ తదితరులు పాల్గొన్నారు.
- June 25, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- Farmers
- KCR
- MLA
- TELANGANA
- కరీంనగర్
- రామడుగు
- Comments Off on ‘రైతుబీమా’ గొప్పపథకం