Breaking News

రియాకు ఉచ్చు బిగుస్తోంది

రియా చుట్టూబిగిస్తున్న ఉచ్చు

ముంబై: సుశాంత్​సింగ్ రాజ్​పుత్ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సుశాంత్​ మాజీ ప్రేయసి రియాచక్రవర్తికి చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. ఈ కేసులో రియా తీరుపై మొదటి నుంచి అనుమానాలు ఉన్నాయి. మరోవైపు రియా చక్రవర్తి కనిపించకుండాపోవడం అనుమానాలకు తావిచ్చింది. రియాను కాపాడేందుకు ముంబై పోలీసులు రియాను కాపాడేందుకు యత్నిస్తున్నారన్న ఆరోపణలు వినిపించాయి. ఈ కేసు విషయంలో ముంబై పోలీసులకు. బీహార్​ పోలీసులకు వాదోపవాదాలు సాగిన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనల నేపథ్యంలో రియా శుక్రవారం ఈడీ ఎదుట హాజరైంది. ఇప్పటికే ఆమెకు ఈడీ నోటీసులు జారీచేసింది. రియా నిర్దోషి అయితే పోలీసులకు ఎందుకు సహకరించకుండా పారిపోతున్నదని బీజేపీ ఎంపీ నీరాజ్​ కుమార్​ సింగ్​ బాబ్లూ ప్రశ్నించారు. ఆమె పోలీసులకు, విచారణ అధికారులకు సహకరించాలని కోరారు.