సారథి న్యూస్, రామగుండం: తెలంగాణ రాష్ట్రంలో రజాకార్ల పాలన కొనసాగుతున్నదని సీపీఐ నాయకులు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సీపీఐ నేతలు కరీంనగర్ జిల్లా రామగుండం మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ కు వినతిపత్రం ఇచ్చారు. వినతి పత్రం ఇచ్చినవారిలో సీపీఐ నగర సహాయ కార్యదర్శి మద్దెల దినేశ్, నాయకులు టీ మల్లయ్య, కే రాజారత్నం, టీ రమేశ్ కుమార్, రేణిగుంట ప్రీతం, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
- October 6, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- CPI
- HYDERABAD
- KARIMNAGAR
- TELANGANA
- ఆంధ్రప్రదేశ్
- తెలంగాణ
- రజాకార్లు
- హైదరాబాద్
- Comments Off on రాష్ట్రంలో రజాకార్ల పాలన