సారథి న్యూస్, నెట్వర్క్: రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలు నిరాడంబరంగా నిర్వహించారు. కరోనా విపత్తువేళ తగిన జాగ్రత్తలు పాటిస్తూ జన్మదిన వేడుకులు జరుపుకున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం కేక్ కట్‌చేసి, నిరుపేదలకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వరరావు కేక్ కట్‌చేసి పేదలకు పండ్లు, వస్త్రాలు పంపిణీ చేశారు. తల్లాడలో మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, టిఆర్ఎస్ జిల్లా నాయకులు జక్కంపూడి కృష్ణమూర్తి కేక్ కట్‌చేశారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల శివారులోని ప్రశాంత్ భవన్లో కేటీఆర్ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు వివేకానంద పేద పిల్లలకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో టీఆర్ఎస్ నాయకులు కలిగేటి కవిత, సుక్రోద్దీన్, గంట్ల వెంకట్ రెడ్డి, గంట్ల జితేందర్ రెడ్డి, కటుకం రవిందర్, ఎడవెల్లి నరేందర్ రెడ్డి, మారుకొండ కిష్టారెడ్డి, తౌటు మురళి, గోపాల్, పయిండ్ల శ్రీనివాస్, స్వామి రాయుడు, రమేశ్, లక్ష్మణ్, రవిందర్ రావు, యాదగిరి, శేఖర్ రెడ్డి, సంజీవ రావు, పాపిరెడ్డి, జగన్మోహన్ గౌడ్, శేఖర్, మల్లేశం, లచ్చయ్య, తిరుపతి, రాజమౌళి, అనిల్, అర్జున్, అనిల్ రావు, కరుణాకర్, శంకర్, మంతపురి రాజుగౌడ్, వనమా రాఘవేంద్రరావు, శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావు, శ్రీరామ్మూర్తి, ఆచార్యులు, వెంకటేశ్వర్లు, విజయ్, వెంకన్న, నాగరాజు, ప్రభాకర్, చిన్న వెంకటేశ్వర్లు, రవి, రమణ, మల్లికార్జున్, లక్ష్మి పద్మావతి, ప్రసాద్, పొట్టేటి సంధ్యారాణి, వీరారెడ్డి, నాగన్న, వెంకటేశ్వర రెడ్డి, వెంకటేశ్వర్లు, నరసింహారావు, రమేశ్, సాగర్, ప్రభాకర్ రావు, నరసింహారావు, కృష్ణయ్య, యూసుఫ్, కేశవ రెడ్డి, గణేశ్, రవి, గోవిందు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
- July 24, 2020
- Archive
- తెలంగాణ
- BIRTHDAY
- KARIMNAGAR
- KTR
- RAMADUGU
- ఎమ్మెల్యే
- కేటీఆర్
- ఖమ్మం
- Comments Off on రామన్న జన్మదినం నిరాడంబరంగా