సారథిన్యూస్, రామడుగు: కరోనా మహమ్మారి మారుమూల పట్టణాలకు పాకింది. తాజాగా కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు వైద్య అధికారులు వెల్లడించారు. దీంతో ప్రజల్లో భయాందోళన నెలకొన్నది. బుధవారం నుంచి 4రోజుల పాటు పట్టణంలో సంపూర్ణ లాక్డౌన్ పాటించాలని గ్రామపంచాయతీ పిలుపునిచ్చింది. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు మాత్రమే కిరాణా దుకాణాలు తెరుస్తామని ఆ సమయంలోనే సరుకులు కొనుగోలు చేయాలని పంచాయతీ పేర్కొన్నది. నిబంధనలు అతిక్రమించినవారికి రూ.2వేలు జరిమానా వేయనున్నారు.
- July 22, 2020
- Archive
- లోకల్ న్యూస్
- CARONA
- KARIMNAGAR
- LOCKDOWN
- RAMADUGU
- కరోనా
- రామడుగు
- Comments Off on రామడుగులో కరోనా కల్లోలం