సారథిన్యూస్, హైదరాబాద్: మాజీ రాష్ట్రపతి అబ్ధుల్ కలాం ఆశయాలు కొనసాగిద్దామని తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందర్‌రాజన్ పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తిని యువత అలవర్చుకోవాలని సూచించారు. కలాం ఐదో వర్ధంతి సందర్భంగా సోమవారం రాజ్‌భవన్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం తమిళనాడులోని కలాం బంధువులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.