Breaking News

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్​గా హరివంశ్​సింగ్​

ఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్​గా హరివంశ్​ నారాయణ సింగ్​ ఎన్నికయ్యారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీచేసిన ఆర్జేడీ నేత మనోజ్​ ఝూ పై హరివంశ్​ గెలుపొందారు. రాజ్యసభ చైర్మన్​ వెంకయ్యనాయుడు ముజువాణి పద్ధతిలో ఓటింగ్​ నిర్వహించి.. హరిశంశ్​ సింగ్ గెలుపొందినట్టు ప్రకటించారు. 2018లో హరివంశ్​ సింగ్​ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్​గా ఎన్నికయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్​లో పదవికాలం ముగియడంతో ఆయన మరోసారి పోటీలో నిలిచారు. మొత్తం 245 మంది సభ్యులున్న రాజ్యసభలో ఎన్డీఏకు 113 మంది సభ్యుల బలం ఉన్నది. ఎన్డీఏకు పలు ప్రాంతీయపార్టీలు కూడా మద్దతు తెలపడంతో సులభంగా విజయం సాధించింది. ఎన్నికల ముందు బీజేపీపై విరుచుకుపడ్డ టీడీపీ ప్రస్తుతం ఎన్డీఏ అభ్యర్థికే మద్దతు ఇవ్వడం గమనార్హం. టీడీపీ వైఖరిపై ఢిల్లీ స్థాయిలో పలు విమర్శుల వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబును కాంగ్రెస్​ పార్టీ ఎప్పటికీ నమ్మదని.. ఆయన ఊసరవెళ్లిలా రంగులు మార్చుతారని కాంగ్రెస్​ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్​ అధికారిక వైఎస్సార్​ కాంగ్రెస్​పార్టీ కూడా ఎన్డీఏకే మద్దతు తెలిపింది. టీఆర్​ఎస్​ మాత్రం ఎన్నికలో పాల్గొనలేదు.