జైపూర్: రాజస్థాన్ రాజకీయం రసకందాయంలో పడింది. ఓ వైపు డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ పార్టీపై తిరుగుబాటు చేయగా.. మరోవైపు కాంగ్రెస్ అధిష్ఠానం రంగంలోకి దిగి పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నది. ఢిల్లీ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేతలు రణ్‌దీప్ సూర్జేవాలా, అజయ్ మకెన్‌లు జైపూర్‌కు చేరుకొని దిద్దుబాటు చర్యలు చేపట్టారు. అశోక్ గెహ్లాట్‌కు 109 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అయితే సచిన్ పైలట్ వెంట ఎంతమంది ఉన్నారు.. అతడి వ్యూహం ఏమిటన్నది తెలియాలంటే కొన్ని గంటలు ఆగాల్సిందే. ఇప్పటికే తాను, తనకు మద్దతిస్తున్న 30 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ శాసనసభపక్ష సమావేశానికి రావడం లేదని ఆయన ఇప్పటికే ప్రకటించారు. కాగా కాంగ్రెస్‌పార్టీ తమ పార్టీ ఎమ్మెల్యేందరికీ విప్ జారీచేసింది. ఈ సమావేశానికి హాజరుకాని ఎమ్మెల్యేలపై కఠినచర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. మరోవైపు సచిన్‌పైలట్ బీజేపీలో చేరుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన సోమవారం ఉదయం బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం కానున్నట్టు సమాచారం. ప్రస్తుతం రాజస్థాన్ రాజకీయాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ యత్నిస్తున్నదని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాక్ ప్రకటించగా.. మీ పార్టీ నేతలను మీరు కాపాడుకోలేక మాపై ఎందుకు విమర్శలు చేస్తున్నారని బీజేపీ ఎదురుదాడికి దిగింది. బీజేపీ నేత జోతిరాధిత్య సింథియా కూడా తన మిత్రుడు సచిన్ పైలట్‌కు మద్దతుగా నిలవడం చర్చనీయాంశం అయ్యింది. రాజస్థాన్‌లో ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఆలస్యంగా తేరుకున్న కాంగ్రెస్ ఈ ఆపదను ఎలా ఎదుర్కొంటుందోనని ఉత్కంఠ నెలకొన్నది.
- July 13, 2020
- Archive
- Top News
- జాతీయం
- CM CHAIR
- CONGRESS
- DELHI
- GEHLOT
- JAIPUR
- RAJASTHAN
- SACHIN PILOT
- రాజస్థాన్
- సచిన్ పైలట్
- Comments Off on రాజస్థాన్‌లో ఏం జరుగుతోంది?