Breaking News

రాఖీ.. ఏదీ గిరాకీ

రాఖీ.. ఏదీ గిరాకీ
  • రాఖీ పౌర్ణమిపై కరోనా ప్రభావం
  • వ్యాపారులకు ఈ ఏడాది తీవ్రనష్టం

సారథి న్యూస్, రామగుండం: కరోనా మహమ్మారి రాఖీల దందాపై కూడా తీవ్రప్రభావం చూపుతోంది. రాఖీ పర్వదినానికి వారం రోజుల ముందు నుంచే ఉమ్మడి కరీంనగర్​ జిల్లా గోదావరిఖని మార్కెట్ లో సందడి ఉండేది. గతేడాది వరకు జోరుగా రాఖీల విక్రయాలు జరిగేవి. కానీ ఈసారి దుకాణాలన్నీ కళతప్పి వెలవెలబోతున్నాయి. కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో మార్కెట్లకు ఎవరూ రావడం లేదు. ఒకవేళ వచ్చినా రాఖీలను కొనేందుకు ధైర్యం చేయడం లేదు. స్థానిక లక్ష్మీనగర్, శివాజీనగర్, ప్రధాన చౌరస్తా ప్రాంతంలో ఉన్న ప్రతి దుకాణం ముందు ఉన్న ఫుట్​పాత్​లు, తోపుడు బండ్లు, టేబుళ్లను ఏర్పాటుచేసి పోటాపోటీగా రాఖీలను విక్రయించేవారు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో దుకాణాలను ఏర్పాటు చేయడానికి వ్యాపారులు ముందుకురాలేదు. కొంతమంది రాఖీల షాపులను పెట్టినప్పటికీ కొనేవారు లేక ఎదురుచూస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో బిజినెస్ పై దెబ్బపడిందని వ్యాపారులు చెబుతున్నారు.