తెలుగులో ఇప్పుడు టాప్ హీరోయిన్ ఎవరంటే తడబడకుండా చెప్పే సమాధానం పూజా హేగ్డే.. ఈ ఏడాది ‘అలవైకుంఠపురములో’ చిత్రంతో పూజా ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు. హీరో అల్లు అర్జున్, దర్శకుడు త్రివ్రిక్రమ్ కంటే ఎక్కువ పేరు పూజాకే వచ్చింది.
అయితే ప్రస్తుతం ఈ అమ్మడు ప్రభాస్‌తో రాధేశ్యామ్ చిత్రంలో నటిస్తున్నది. పీరియాడికల్ లవ్‌స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా మ్యూజిక్ టీచర్‌గా కనిపిస్తుందని టాక్. అంతేకాక ఈ సినమాలో పూజా డ్యూయెల్‌రోల్ చేస్తున్నదట. అందులో ఓ లుక్ ట్రెడిషనల్ క్లాసిక్‌గా ఉంటుందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాలంటే చిత్ర యూనిట్ స్పందించాల్సిందే. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.