Breaking News

మొగి పురుగును అంతమొందిద్దాం

సారథి న్యూస్, రామాయంపేట: ప్రస్తుతం వరిపంటకు మొగి పురుగు ఆశించిందని తగిన మందులు వాడి అరికట్టవచ్చని నిజాంపేట మండల వ్యవసాయాధికారి సతీష్​ పేర్కొన్నారు. శనివారం ఆయన నిజాంపేట మండలంలో వరి పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరి పంటలో మొగి పురుగు పొట్ట దశలో ఉన్నప్పుడే కార్టప్ హైడ్లో క్లోరైడ్ 400 గ్రామ్స్ లేదా కోరాజిన్ 60 ఎంఎల్​ లీటర్​ నీటికి ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవాలని సూచించారు. అలాగే దోమపోటు నివారణకు డినోటీఫ్యూరన్ 80 గ్రామ్స్ లేదా పైమెట్రోజన్ 120 గ్రామ్స్ లేదా పెక్సన్ 98 ఎంఎల్ పిచికారీ చేయాలని సూచించారు. కంకి నల్లి నివారణకు ప్రొఫానోఫస్ 2 ఎంఎల్.. లీటర్ నీటికి కలిపి మందులను పిచికారీ చేసుకోవాలని పేర్కొన్నారు. యాసంగిలో శనగలు వేసుకునే రైతులకు శనగ విత్తనాలు నిజాంపేట ఆగ్రోస్ కేంద్రంలో అందుబాటులో ఉన్నాయన్నారు. 25 కేజీల శనగ బ్యాగులు 80 బస్తాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.