బిగ్‌బాస్ సీజన్ 4 ఈ వారం కొంత ఆసక్తికరంగా సాగింది. అయితే ఈ వారం హౌస్నుంచి మెహబూబ్ బయటకు వెళ్లిపోనున్నట్టు సమాచారం. ఇటీవల హౌస్‌లో నిర్వహించిన ఉక్కు హృదయం టాస్క్‌లో మెహబూబ్ ఓవరాక్షన్ చేయడంతో ప్రేక్షకులు అతడికి తక్కువ ఓట్లు వేశారట. దీంతో మెహబూబ్ ఈ వారం ఎలిమినేట్ అవుతున్నట్టు టాక్. ఈ వారం మోనాల్, లాస్య, దేవి, కుమార్ సాయి, మెహబూబ్, అరియానా, హారికలు ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యారు.
అయితే గత వారం వరకు మెహబూబ్‌పై ప్రేక్షకుల్లో నెగిటివ్ టాక్ ఏమీ లేదు.. కానీ ఉక్కు హృదయం టాస్క్‌లు పెద్దగా అరవడంతో ప్రేక్షకుల్లో అతడిపై కోపం పెరిగిందట.. ఇటీవల ఓ వెబ్‌సైట్ నిర్వహించిన పోల్‌లోనూ మెహబూబ్‌కి వ్యతిరేకంగా చాలా మంది ఓటేశారు. దీంతో శనివారం అతడు బయటకు వెళ్లిపోనున్నట్టు సమాచారం. అయితే శుక్రవారం హౌజ్‌లోకి సాక్షి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చింది. ఆమె ఎంట్రీతోనైనా హౌస్‌లో ఎంటర్టైన్మెంట్ పెరుగుతుందేమోనని ప్రేక్షకులు ఆశగా ఎదురుచూస్తున్నారు.