Breaking News

మూడు రోజులు భారీవర్షాలు

మూడు రోజులు భారీవర్షాలు

హైదరాబాద్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో మరో మూడురోజుల పాటు హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు రిపోర్ట్​లో వెల్లడించారు. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా లోతట్టు ప్రాంతాల వాసులను ఖాళీ చేయిస్తున్నారు. ఇప్పటివకే వారం రోజులుగా భారీవర్షాలు, వరదలు, బురదతో భాగ్యనగరం వాసుల బాధలు వర్ణణాతీతం. ఇదిలాఉండగా, మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్​యాదవ్ సూచించారు. లోతట్టు కాలనీవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.