సారథి న్యూస్, హైదరాబాద్: ముదిరాజ్ కులస్తుల సమస్యలు పరిష్కరించి, వారి అభ్యున్నతికి కృషిచేస్తానని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టంచేశారు. హైదరాబాద్‌లోని కోకాపేట్లో ముదిరాజ్కులస్తులకు ప్రభుత్వం కేటాయించిన ఐదెకరాల స్థలంలో నిర్మించనున్న భవన నిర్మాణానికి ఆదివారం మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ.. స్థలం కేటాయించినందుకు సీఎంకు కృతజ్క్షతలు తెలిపారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో ముదిరాజ్ కులస్తులు లేని ఊరు, చేప తిననివారు లేరని వివరించారు. ముదిరాజ్ లు తెగువ, నమ్మకానికి మారుపేరని అన్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ, రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ అభివృద్ధిలోనూ సీఎం కేసీఆర్‌కు కుడిభుజంగా ఈటల రాజేందర్ ఉన్నారని కొనియాడారు. కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, గంగుల కమలాకర్, చామకూర మల్లారెడ్డి, రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, బండ ప్రకాష్, ఎమ్మెల్యేలు పి.చంద్రశేఖర్, ఆకుల రాజేందర్పాల్గొన్నారు.
- January 10, 2021
- Archive
- Top News
- తెలంగాణ
- పొలిటికల్
- షార్ట్ న్యూస్
- CM KCR
- ETALA
- MIDIRAJ
- TELANGANA
- తెలంగాణ
- మంత్రి ఈటల
- ముదిరాజ్ కులస్తులు
- సీఎం కేసీఆర్
- Comments Off on ముదిరాజ్ కులస్తుల అభ్యున్నతికి కృషి