కరోనా మహమ్మారి సామాన్యులతోపాటు సెలబ్రిటీలను సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రముఖ సినీ నేపథ్యగాయకుడు, గానగాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా సోకి ప్రస్తుతం చెన్నైలోని ఎంజీఎం దవాఖానలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. సింగర్లు సునీత, మాళవిక కూడా కరోనా బారినపడ్డారు. అయితే తాజాగా మరో విషాధకరమైన విషయం ఏమిటంటే.. మాళవిక రెండేండ్ల కుమార్తెకు కరోనా సోకింది. దీంతో మాళవిక కుటుంబం తీవ్ర ఆందోళన చెందుతోంది. మాళవిక తల్లిదండ్రులు కూడా కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం వారంతా హోంఐసోలేషన్లో ఉండి చికిత్సపొందుతున్నారు. కాగా మాళవిక, ఆమె కూతురు తొందరగా కొలుకోవాలని పలువురు సినీ ప్రముఖలు ట్వీట్లు పెట్టారు.