సారథి న్యూస్ నారాయణఖేడ్: మహిళా ఎంపీటీసీపై దాడి జరిగిన ఘటన సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలో చోటుచేసుకున్నది. దెగుల్ వాడి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ ఎంపీటీసీ సుశీలమ్మపై కాంగ్రెస్ పార్టీకి చెందిన సొసైటీ మెంబర్ కుపేందర్ రెడ్డి అయన కుటుంబ సభ్యులు దాడి చేశారు. మహిళా అన్ని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడి దాడి చేసినట్లు ఎంపీటీసీ సుశీలమ్మ ఆరోపించారు. సొయా విత్తనాల కోసం రైతులకు టోకెన్లు అందిస్తున్న సమయంలో మాటమాట పెరిగి దాడికి దారి తీసిందని సమాచారం. బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ నాయకుడు సంతోష్ పాటిల్, ఎంపీపీ సంగీత వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.
- June 16, 2020
- Archive
- క్రైమ్
- మెదక్
- లోకల్ న్యూస్
- ATTACK
- HYDERABAD
- MPTC
- SANGAREDDY
- కఠినచర్యలు
- సొయా విత్తనాలు
- Comments Off on మహిళా ఎంపీటీసీపై దాడి