సారథిన్యూస్, హైదరాబాద్: ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. ఎమ్మెల్యేతో పాటు ఆయన భార్య, ఇద్దరు కొడుకులు, వంటమనిషికి కూడా కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. డాక్టర్ల సలహాలమేరకు సుధీర్‌రెడ్డి కుటుంబసభ్యులందరూ ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నారు. తెలంగాణలో ఇప్పటికే హోంమంత్రి మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాలా గణేష్ గుప్తా, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి కరోనా బారిన పడి కోలుకున్నారు.
- August 8, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- CARONA
- SUDHEER REDDY
- TRS
- కరోనా
- టీఆర్ఎస్
- సుధీర్‌రెడ్డి
- Comments Off on మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా