న్యూఢిల్లీ: ఇండియా – చైనా సరిహద్దుల్లోని గాల్వాన్‌లో చైనా సైనికులు పాల్పడ్డ దాడికి సంబంధించి ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఈ విషయమై శనివారం ఉదయం కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ రాహుల్ ట్వీట్లు చేశారు. ‘ప్రధాని ఇండియన్ టెరిటరినీ చైనా దురాక్రమణకు అప్పగించారు. 1. మన సైనికులను ఎందుకు చంపారు? 2. ఎక్కడ చంపారు?’ అంటూ ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. మన టెరిటరీలోకి ఎవరూ ఎంటర్ కాలేదు, ఏమీ తీసుకెళ్లలేదు అని మోడీ చెప్పిన విషయాన్ని రాహుల్ పోస్ట్ చేస్తూ ఈ ప్రశ్నలు అడిగాడు. చైనా ప్రీప్లాన్డ్‌గా దాడి చేస్తే ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదని, దానికి మన సైనికులు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని రాహుల్ గాంధీ శుక్రవారం ట్వీట్ చేశారు.