సారథి న్యూస్, రామాయంపేట: మత్స్యకారులను ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఎంతో కృషిచేస్తోందని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. మంగళవారం ఆయన మెదక్ జిల్లా రామాపంపేట మండలం డీ. ధర్మారంలోని ఊరచెరువులో సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద 1.76కోట్ల చేపపిల్లలను వదిలారు. మత్స్యకారులు దళారులను నమ్మకుండా చేపలను సొంతంగా మార్కెటింగ్ చేసుకునేలా అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. అనంతరం గ్రామంలో రూ.16 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనంతో పాటు డంప్‌యార్డు, వైకుంఠధామాలను ప్రారంభించారు. కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్, జిల్లా మత్స్య శాఖ అధికారి శ్రీనివాస్, జడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్ పాల్గొన్నారు.
- August 11, 2020
- Archive
- Top News
- మెదక్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- HARISHRAO
- medak
- MINISTER
- MLA
- TELANGANA
- తెలంగాణ
- రామాయంపేట
- Comments Off on మత్స్యకారులను ఆదుకుంటాం