సారథిన్యూస్, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో తమకు కావల్సిన బ్రాండ్ దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్న మందుబాబులకు ఏపీ హైకోర్టు గుడ్న్యూస్ చెప్పింది. ఇక నుంచి ఎవరైనా ఇతర రాష్ట్రాలకు వెళ్లి తమకు నచ్చిన మూడు ఫుల్ బాటిళ్లు తెచ్చుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో తమకు కావాల్సిన బ్రాండ్లు దొరకక మందుబాబులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లి తెచ్చుకుందామంటే పోలీసులు, ఎక్సైజ్ అధికారులు సీజ్చేస్తున్నారు. ఏపీలోకి ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తీసుకురానివ్వక పోవడంపై దాఖలైన ఓ వ్యక్తి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై బుధవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. ఇతర రాష్ట్రాల నుంచి 3 మద్యం సీసాలు తీసుకురావచ్చని తీర్పునిచ్చింది. జీవో 411 అమలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది.
- September 2, 2020
- Archive
- Top News
- ఆంధ్రప్రదేశ్
- 3 BOTTELS
- AP
- BRANDS
- HIGHCOURT
- LIQUOR
- ఆంధ్రప్రదేశ్
- కర్ణాటక
- తెలంగాణ
- హైకోర్టు
- Comments Off on మందుబాబులకు కోర్టు గుడ్న్యూస్