సారథి న్యూస్, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ కు చెందిన చెరుకుపల్లి రామలింగయ్య కరోనాతో మృతిచెందారు. దహన నమస్కారాలు నిర్వహించేందుకు కుటుంబసభ్యులు ఎవరూ ముందుకురాలేదు. నేనున్నానని.. మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ పీపీఈ కిట్ ధరించి సోమవారం అతని అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా వైరస్ తో మరణిస్తే అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం హేయమైనా చర్యగా అభివర్ణించారు. కరోనా ప్రబలిన నాటి నుంచి మృతుల అంత్యక్రియలు నిర్వహిస్తున్న తీరు మానవీయ విలువలను మంటగలిపేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. డెడ్ బాడీ నుంచి వైరస్ వ్యాప్తి చాలా తక్కువగా ఉంటుందని, బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన నుంచి బయటికి రావాలని సూచించారు.
- August 10, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- CARONA
- MAHABUBNAGAR
- V.SRINIVASGOUD
- కరోనా
- మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్
- మహబూబ్‌నగర్
- Comments Off on మంత్రి.. నేనున్నానని