సారథి న్యూస్, వాజేడు, ములుగు: జిల్లాలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో సోమవారం నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియ ప్రారంభంకానుందని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్.క్రిష్ణఆదిత్య తెలిపారు. రిజిస్ట్రేషన్ కోసం రూ.200 చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. మీసేవా, ధరణి ద్వారా ప్రజలకు పారదర్శకంగా భూసంబంధిత సేవలు అందిస్తామన్నారు. జిల్లాలో 47 మీసేవా సెంటర్లు, 60 కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా సేవలు అందించనున్నట్లు వివరించారు. మీ సేవా సెంటర్ నిర్వాహకులు ప్రభుత్వ నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ వసూలు చేస్తే కఠినచర్యలు తప్పవన్నారు. ప్రజలకు మరింత పకడ్బందీగా సేవలు అందించేందుకు ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టం రూపొందించిందని, ధరణి పోర్టల్ ద్వారా పారదర్శకమైన సేవలు అందిస్తామన్నారు. ప్రజలకు సౌలభ్యంగా, సులభతరంగా ఉండేలా ధరణి పోర్టల్ ను రూపొందించినట్లు తెలిపారు.
- November 1, 2020
- Archive
- Top News
- లోకల్ న్యూస్
- వరంగల్
- షార్ట్ న్యూస్
- DHARANI
- MULUGU
- TELANGANA
- VAJEDU
- కలెక్టర్
- కృష్ణ ఆదిత్య
- తెలంగాణ
- ధరణి
- ములుగు
- వాజేడు
- Comments Off on భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ఈజీ