అమరావతి, సారథిన్యూస్: టీడీపీ ఫైర్ బ్రాండ్, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు. ‘నాకు కరోనా సోకింది. ప్రస్తుతం స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయి. 14 రోజులు క్వారంటైన్లో ఉండాలని వైద్యులు సూచించారు. కొన్నిరోజుల పాటు కార్యకర్తలు, అభిమానులు ఎవరూ నా వద్దకు రావొద్దు. టీడీపీ అధినేత చంద్రబాబు, కార్యకర్తల ఆశీస్సులతో త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో మీ ముందుకు వస్తా’ అంటూ ఆయన ట్వీట్టర్లో పేర్కొన్నారు. మరోవైపు బుద్దా వెంకన్న త్వరగా కోలుకోవాలని టీడీపీ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.
- August 28, 2020
- Archive
- Top News
- ఆంధ్రప్రదేశ్
- పొలిటికల్
- ANDHRAPRADESH
- AP
- BUDDA VENKANNA
- CARONA
- DOCTORS
- TDP
- TWWET
- ఎమ్మెల్సీ
- ఏపీ
- టీడీపీ
- Comments Off on బుద్దా వెంకన్నకు కరోనా