సారథి న్యూస్, రామడుగు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా రామడుగులోని పలువురు బీజేపీ నేతలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేత ఒంటెల కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాచరికపాలన కొనసాగుతున్నదని మండిపడ్డారు. పోలీసులు ముందస్తు అరెస్ట్‌చేసిన వారిలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ జిన్నారం విద్యాసాగర్, బీజేవైఎం మండలాధ్యక్షుడు రమేశ్‌గౌడ్, ఓబీసీ మోర్చా నాయకులు శ్రీనివాస్ గౌడ్, తిర్మలపూర్ ఎంపీటీసీ మోడీ రవీందర్, నాయకులు కొత్త వెంకటేశ్, కారుపాకల అంజిబాబు, జిట్టవేని అంజిబాబు, పురేళ్ల శ్రీకాంత్ గౌడ్, నరేశ్, శివరెడ్డి, శ్రీనివాస్ గౌడ్, రాజు, అశోక్ రెడ్డి, రామ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
- September 11, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- BJP
- CM
- HYDERABAD
- KARIMNAGAR
- KCR
- LEADERS
- TELANGANA
- కరీంనగర్
- తెలంగాణ
- సీఎం కేసీఆర్
- Comments Off on బీజేపీ నేతల ముందస్తు అరెస్ట్