Breaking News

బీజేపీలో చేరడం లేదు

న్యూఢిల్లీ: తాను బీజేపీలో చేరడం లేదని.. కాంగ్రెస్​ బహిష్కృత నేత సచిన్​ పైలట్​ స్పష్టం చేశారు. ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో కాంగ్రెస్​పార్టీ అతడిపై వేటు వేసింది. పీసీసీ అధ్యక్షపదవి నుంచి, డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించింది. దీంతో సచిన్​ పైలట్​ ఏం చేస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. కాగా తాను బీజేపీలో చేరడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆయన భవిష్యత్​ కార్యాచరణపై త్వరలోనే ఓ ప్రకటన చేయనున్నట్టు సమాచారం. సరైన వ్యూహం లేకుండా ముందుకు వెళ్లడంతో సచిన్​ పైలట్​ బొక్కబోర్లా పడ్డారని రాజకీయపండితులు విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్​ పార్టీనుంచి బయటకు వెళ్లే ముందు ఆయన సరైన వ్యూహం రచించలేదన్న విశ్లేషకులు భావిస్తున్నారు. కేవలం ఆవేశంతో బయటకు వెళ్లిన సచిన్​కు ఇటు బీజేపీ.. అటు కాంగ్రెస్​ అధినాయకత్వం రెండూ ఆయనకు చెయ్యిచ్చాయి. రాజస్థాన్​ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకున్న కాంగ్రెస్​ నేతలు వ్యూహాత్మంగా వ్యవహరించి రాజస్థాన్​లో ప్రస్తుతానికైతే ముప్పు నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం సీఎం అశోక్​ గెహ్లాట్​ చేతిలో మ్యాజిక్​ ఫిగర్​కు కావల్సిన ఎమ్మెల్యేలు ఉన్నట్టు సమాచారం. సచిన్​ పైలట్​ ఎటువంటి వ్యూహాలు రచిస్తారో వేచి చూడాలి.