ఢిల్లీ: ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్బుక్.. భారతీయజనతాపార్టీకి సహకరిస్తోందని అమెరికాకు చెందిన ‘ది వాల్‌స్ట్రీట్ జర్నల్’ ఓ కథనం ప్రచరించింది. ఇందుకోసం బీజేపీ తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ పెట్టిన పోస్టులను ఆ కథనంలో ప్రస్తావించారు. కాగా ఈ కథనం ఆధారంగా కాంగ్రెస్ బీజేపీపై విరుచుకుపడింది. రాహుల్‌గాంధీ కూడా ఫేస్బుక్ బీజేపీకి సహకరిస్తోందంటూ ఆరోపించారు. ఇన్నిరోజులకు అమెరికాకు చెందిన మీడియా వార్తలు ప్రచురిందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఫేస్బుక్ స్పందించింది. తమకు ఏ రాజకీయపార్టీతోనూ సంబంధం లేదని ఫేస్బుక్ ఇండియా ప్రతినిధి వివరణ ఇచ్చారు. హింసను ప్రేరేపించేలా ఏ రాజకీయ పార్టీ పోస్టుపెట్టినా తాము దాన్ని తొలగిస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంపై ప్రపంచవ్యాప్తంగా ఒకేరకమైన నిబంధనలు అవలంభిస్తున్నామని స్పష్టం చేశారు.