హైదరాబాద్: తెలుగులో గత మూడు సీజన్లుగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న బిగ్ బాస్- 4 సీజన్ నేటి నుంచి మొదలవనుంది. ఈ మేరకు హౌస్ లోకి వెళ్ళబోయెది వీళ్లేనని కొద్దికాలంగా సామాజిక మాధ్యమాలలో కొందరు సెలబ్రిటీల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇంతవరకు దీనిపై ‘మా టీవీ’ నుంచి గాని, బిగ్ బాస్ యాజమన్యం నుంచి గాని అధికారిక ప్రకటన వెలువడలేదు. కాగా, ఆదివారం 6 గంటలకు ప్రారంభం కానున్న ఈ షో లో పాల్గొనేవాళ్ల జాబితా (కన్ఫర్మ్) విడుదలయింది. సినీ నటులు, టివి యాంకర్లు, దర్శకులు, టిక్ టాక్, యూట్యూబ్ స్టార్లు కలగలిసి ఉన్న 17 మంది జాబితా ఇదే.
- అమ్మ రాజశేఖర్ (దర్శకుడు)
- సూర్యకిరణ్ (దర్శకుడు)
- కరాటే కళ్యాణి (నటి)
- నోయల్ (నటుడు, ర్యాప్ గాయకుడు)
- లాస్య (యాంకర్)
- అవినాష్ (జబర్దస్త్ ఫేం)
- దేవి (టీవీ9 న్యూస్ రీడర్)
- అభిజిత్ (లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేం)
- సాయికుమార్ (ఈ రోజుల్లో ఫేం)
- గంగవ్వ (మై విలేజ్ షో ఫేం)
- మెహబూబ్ షేక్ (టిక్ టాక్ స్టార్)
- సయ్యద్ సొహైల్ (కృష్ణవేణి ఫేం)
- అఖిల్ (బంగారు గాజులు ఫేం)
- దివ్య (మహర్షి ఫేం)
- దేత్తడి హారిక (యూట్యూబ్ స్టార్)
- జోర్దార్ సుజాత (యాంకర్)
- మోనాల్ గజ్జర్ (సుడిగాడు ఫేం)