చెన్నై: కరోనాతో బాధపడుతూ చెన్నైలోని ఎంజీఎం దవాఖానలో చికిత్స పొందుతున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రస్తుతం కోలుకుంటున్నారని.. ఆయనకు కరోనాకు నెగిటివ్ వచ్చిందని సోమవారం ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతున్నది. అయితే ఈ వార్త పూర్తిగా అవాస్తవమని ఆయన కుమారుడు, ప్రముఖ గాయకుడు ఎస్పీ చరణ్ తేల్చిచెప్పారు. ఆయన ఆరోగ్యం ఇంకా విషయమంగానే ఉన్నదని పేర్కొన్నారు. ‘ నాన్నగారు తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న అభిమానులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఆయన ఆరోగ్యంపై ఏ విషయమైనా నేనే స్పందిస్తా. దయచేసి అసత్య ప్రచారాలు నమ్మకండి. ఆయనకు ఇంకా ఎక్మో పరికరంతోనే చికిత్స అందిస్తున్నారు. కరోనా నెగిటివ్ రావడం అసత్యం’ అని చరణ్ వీడియోలో వెల్లడించారు.