‘నాయక్’ సినిమాలో చరణ్ తేజ్ పక్కన, ‘ఇద్దరమ్మాయిలతో’ బన్నీ పక్కన నటించిన అమలా పాల్ తెలుగులో అనుకున్నంత సక్సెస్‌ను సాధించలేకపోయింది. దీంతో తమిళం, మలయాళ ఇండస్ట్రీ వైపు దృష్టి సారించి అక్కడ విజయాలను అందుకుంటోంది. అయితే ఇప్పుడు తెలుగులో ఓ మాంచి చాన్స్ అమలాపాల్ ను వరించిందట. బాలయ్య బాబు, బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంలో అమలా హీరోయిన్ క్యారెక్టర్‌ను దక్కించుకుందన్న వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతోంది.
బాలయ్య సరసన ఇద్దరు హీరోయిన్ల నటించనుండగా ప్రధాన హీరోయిన్గా అమలాపాల్‌ను ఎంచుకున్నారని తెలుస్తోంది. రెండో హీరోయిన్ గా కొత్త అమ్మాయిని తీసుకోనున్నారట. అయితే ఈ సినిమా టైటిల్ విషయంలో కూడా ఓ కొలిక్కి రాలేకపోతున్నారు. మొదట మోనార్క్, అఘోర వంటి పేర్లు అనుకున్నారు.. ఇప్పుడు ‘సూపర్ మ్యాన్’ అంటున్నారు. అధికారికంగా అయితే ఇంకా అనౌన్స్కాలేదు. మిర్యాల రవీంద్రరెడ్డి సమర్పిస్తున్న ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తయ్యింది. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. అనంతరం సెట్స్‌పైకి వెళ్లనుంది.