ప్రైవేట్ ఆస్పత్రుల్లో అధిక చార్జీలు వసూలు చేయడంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అపోలో, బసవతారకం ఆస్పత్రులకు తెలంగాణ ప్రభుత్వం భూమి కేటాయించిందని.. ఆ సందర్భంగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ రెండు ఆస్పత్రులు కొందరు పేదరోగులకు ఉచిత వైద్యం చేయాల్సి ఉంది. అయితే ఈ రెండు ఆస్పత్రులు ఒప్పందాన్ని ఉల్లంఘించాయని ఓ వ్యక్తి కోర్టుకెక్కాడు. దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు ఈ రెండు దవాఖానలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే తెలంగాణ ప్రభుత్వం ఈ రెండు దవాఖానలకు కేటాయించిన స్థలాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది హైకోర్టు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రికి బాలకృష్ణ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
- August 5, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- BALAKRIDHNA
- HIGHCOURT
- HYDERABAD
- NANDAMURI
- బాలకృష్ణ
- హైకోర్టు
- Comments Off on బాలకృష్ణకు హైకోర్టు షాక్