సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు భారీ వేడుకలు ప్లాన్ చేశారు. అయితే ఆ ఉత్సాహం ఎంతోసేపు నిలవలేదు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం ఏడవమైలు గ్రామంలో భారీ ఫ్లెక్సీలు కడుతున్న సమయంలో కరెంట్ షాక్కు గురై ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. స్పందించిన పవన్ వారి కుటుంబాలకు అండగా ఉంటానని హామీఇచ్చారు. ఇదే సమయంలో అభిమానుల కుటుంబాలకు రామ్ చరణ్ కూడా ఆర్థికసాయాన్ని ప్రకటించారు. వాళ్లతో పాటే అల్లు అర్జున్ కూడా తనవంతు సాయం అన్నట్లు అభిమానులకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. హఠాత్తుగా జరిగిన ఈ ఘటన తనకు దిగ్భ్రాంతిని కలిగించిందని, మెగా ఫ్యాన్స్ అంటే తనకు ఎంతో అభిమానమని.. పోయిన వారిని ఎలాగూ తీసుకురాలేం కాబట్టి వారి కుటుంబాలనైనా ఆదుకోవాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఒక్కొక్కరికి రూ. రెండు లక్షల నగదు సాయాన్ని అందిస్తానని బన్నీ ప్రకటించాడు.
- September 3, 2020
- Archive
- Top News
- సినిమా
- ALLUARJUN
- BUNNY
- MEGASTAR
- PAVANKALYAN
- TOLLYWOOD
- అల్లు అర్జున్
- టాలీవుడ్
- పవన్ కళ్యాణ్
- బన్నీ
- Comments Off on బన్నీ పెద్దమనసు