సారథి న్యూస్, కర్నూలు: ప్రైమ్ మినిస్టర్ ఇన్నోవేటివ్ అవార్డ్ ఎంపిక కోసం దేశవ్యాప్తంగా షార్ట్ లిస్ట్ అయిన 12 మంది జిల్లా కలెక్టర్లలో కర్నూలు జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ మొదటి స్థానంలో నిలిచారు. ఈనెల 9న ఉదయం 10 గంటలకు వీడియో, వెబ్ కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర కేబినెట్ సెక్రటరీ బృందానికి కలెక్టర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, పబ్లిక్ గ్రీవెన్సెస్, పాలన సంస్కరణల శాఖ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్) సతీష్ కె.జాదవ్ రాసిన లేఖను ఈ-మెయిల్ ద్వారా శుక్రవారం సాయంత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్కు పలువురు ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ఉన్నతాధికారులు, ఎస్పీ డాక్టర్కె.ఫక్కీరప్ప, జేసీలు రవిపట్టన్ షెట్టి, రామసుందర్ రెడ్డి, సయ్యద్ ఖాజా మొహిద్దీన్, జిల్లా అధికారుల సంఘం నేతలు, మీడియా ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు.
- September 4, 2020
- Archive
- Top News
- ఆంధ్రప్రదేశ్
- కర్నూలు
- COLLECTOR
- INNOVATIVE
- Kurnool
- POWERPOINT
- PRESETATION
- PRIME MINISTER
- కర్నూలు
- కలెక్టర్
- పవర్ పాయింట్
- ప్రెజెంటేషన్
- ప్రైమ్ మినిస్టర్ ఇన్నోవేటివ్
- Comments Off on ప్రైమ్ మినిస్టర్ ఇన్నోవేటివ్ అవార్డుకు కర్నూలు కలెక్టర్