తాను ఇంతకాలం పెంచి పెద్దచేసిన కూతురు తన మాట వినకుండా ప్రియుడితో వెళ్లిపోవడాన్ని ఓ తల్లి సహించలేకపోయింది. అవమానం భారం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొన్నది. తమిళనాడులో రాష్ట్రంలో జరిగిందీ ఘటన.. తిరువళ్లూర్ జిల్లా తిరుత్తణి నెహ్రూనగర్‌కు చెందిన శ్రీనివాసన్, మహేశ్వరి దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. వారి కూతురు పదో తరగతి చదువుతున్నప్పటి నుంచే ఓ యువకుడిని ప్రేమించింది.
ఈ నెల 10న అతనితో పారిపోయింది. తల్లిదండ్రులు, బంధువులు కుమార్తె కోసం పలు ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో కూతురు చేసిన పనిని మహేశ్వరి అవమానంతో కుంగిపోయింది. ఈనెల 11న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించున్నది. గమనించిన స్థానికులు ఆమెను తిరుత్తణి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్సపొందతూ ఆదివారం రాత్రి ప్రాణాలు కోల్పోయింది.