సారథి న్యూస్, చిన్నశంకరంపేట: మెదక్ జిల్లా చిన్నశంకరంపేట బీజేపీ మండల కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. బీజేపీ మండల అధ్యక్షుడిగా మంగళి యాదగిరి, ప్రధానకార్యదర్శులుగా నరేందర్, దశరథ్, ఉపాధ్యక్షులుగా పెంటా గౌడ్, మేడి స్వామి, శ్రీనివాస్ రెడ్డి, కృష్ణ, గోపాల్, కార్యదర్శులుగా వడ్ల సిద్ధిరాములు, సంతోశ్‌రెడ్డి, సురేశ్, కోశాధికారిగా బాలసుబ్రమణ్యం, యువ మోర్చా అధ్యక్షుడిగా మహేశ్, కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా వెంకటేశ్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా మూర్తి శంకర్, ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా డప్పు స్వామి, మైనార్టీ మోర్చా అధ్యక్షుడిగా ఎండీ సయ్యద్, ఎస్టీ మోర్చా అధ్యక్షుడిగా ధరావత్ నరేశ్, పట్టణ అధ్యక్షుడిగా ఆకుల రాజు ఎన్నికయ్యారు. కాగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా దత్తు ప్రకాశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ శ్రేణుల ప్రజాసమస్యలపై పోరాటాలు చేసి.. పార్టీని బలోపేతం చేయాలని సూచించారు.
- August 16, 2020
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- BJP
- HYDERABAD
- medak
- NEWCOMMITEE
- TELANGANA
- నూతనకమిటీ
- బీజేపీ
- Comments Off on ప్రజాసమస్యలపై పోరాడుదాం