Breaking News

పోలీస్ ​గస్తీ మరింత పటిష్టం

సారథి న్యూస్, హుస్నాబాద్ : గ్రామాల్లో రాత్రి వెళల్లో పోలీస్​గస్తీని పటిష్ఠం చేయాలని ఏసీపీ సందేపొగు మహేందర్ అన్నారు. గురువారం కరీంనగర్​ జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన డివిజన్ స్థాయి నేర సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఇటీవల రోడ్డు ప్రమాదాలతో అనేక మంది మృత్యువాత పడుతున్నారన్నారు. వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించాలని సూచించారు. దర్యాప్తలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో హుస్నాబాద్ సీఐ రఘు, చేర్యాల సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐలు శ్రీధర్, రాజకుమార్, మోహన్ బాబు, నరేందర్ రెడ్డి, రవి, సంపత్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.