సారథి న్యూస్, మానవపాడు: సినీ హీరోలు, దర్శకులపై అభిమానులకు ఉన్న క్రేజీ అంతా ఇంత కాదు. సాధారణంగా పుట్టిన రోజు, వివాహ వార్షికోత్సవం సందర్భంగా పండ్లు, వస్ర్తాలను పంపిణీ చేయడం పరిపాటి. అయితే ఓ సినీ డైరెక్టర్ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఫ్యాన్స్ వినూత్న కార్యక్రమం చేపట్టారు. రూపాయికే క్వార్టర్ మద్యం అందజేసి.. అన్నదానం చేసి తమ అభిమానం చాటుకున్నారు. సినీ డైరెక్టర్ ఎన్.శంకర్ పెళ్లిరోజు వేడుకను అభిమానులు ఆదివారం జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ లో కోలాహలంగా జరుపుకున్నారు. అలంపూర్ బస్టాండ్ ఆవరణలో రెండొందల మందికి అన్నదానం చేశారు. ఒక్క రూపాయికే క్వార్టర్ మద్యం పంపిణీ చేశారు. సినీ డైరెక్టర్ శంకర్‌పై ఉన్న అభిమానంతో, అభిమానుల కోరిక మేరకే ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు చింతకుంట విష్ణు తదితరులు పాల్గొన్నారు.
- November 15, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- ALAMPUR
- DIRECTOR SHANKAR
- GADWALA
- JOGULAMAB
- TELANGANA
- అలంపూర్
- ఎన్.శంకర్
- జోగుళాంబ గద్వాల
- తెలంగాణ
- సినీడైరెక్టర్
- Comments Off on పెళ్లి రోజు.. రూపాయికే క్వార్టర్ మందు!