సారథి మీడియా, పెద్దశంకరంపేట: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రంలో ఈనెల 31 వరకు లాక్డౌన్ కొనసాగించనున్నారు. ఈ మేరకు గురువారం వ్యాపారస్తులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. గురువారం పెద్ధశంకరంపేటలోని పద్మయ్య పంక్షన్హాల్లో మండల ప్రజాప్రతినిధులు, వ్యాపారులు సమావేశమయ్యారు. మండలంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వ్యాపారులు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్, తహసీల్దార్, ఎస్సై, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మురళి పంతులు, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షడు కుంట్ల రాములు, మండల పరిషత్ ఉపాధ్యక్షడు రమేష్ పాల్గొన్నారు.
- August 20, 2020
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- CARONA
- LOCKDOWN
- medak
- PEDDASHANKARAMPET
- POLICE
- కరోనా
- మెదక్
- లాక్డౌన్
- Comments Off on పెద్దశంకరంపేటలో 31 వరకు లాక్డౌన్